ప్రియాంక చోప్రాకు మరో గౌరవం

0
27

లాస్ ఏంజిల్స్: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు మ‌రో గౌర‌వం ద‌క్కింది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల‌ను ప్ర‌దానం చేసిన ప్రియాంక.. వ‌చ్చే ఏడాది గోల్డెన్ గ్లోబ్ అవార్డును ప్ర‌దానం చేయ‌నుంది. జ‌న‌వ‌రి 8న లాస్ ఏంజిల్స్‌లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల‌ను అంద‌జేస్తారు. ఆ కార్య‌క్ర‌మంలో ప్రియాంక కూడా ఓ అవార్డును విజేత‌కు అంద‌జేయ‌నుంది. ఈ విష‌యాన్ని గోల్డెన్ గ్లోబ్ ప్ర‌క‌టించింది. సినిమా, టెలివిజ‌న్ క్యాట‌గిరీల్లో గోల్డెన్ అవార్డుల‌ను అంద‌జేస్తారు. ప్రియాంక ప్ర‌స్తుతం గోవాలో న్యూయార్ వేడుక‌ల‌ను ఎంజాయ్ చేస్తోంది. అమెరికా టీవీ షో క్వాంటికోలో సీఐఏ ఏజెంట్‌గా ప్రియాంకా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ షోకు ఆమె బ్రేక్ తీసుకుంది. వ‌చ్చే ఏడాది రెండు బాలీవుడ్ చిత్రాల‌ను చేయ‌నున్న‌ట్లు ప్రియాంకా ఇప్ప‌టికే వెల్ల‌డించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here