ప్రిన్స్ బాధ్యతల నుంచి వైదొలుగనున్న ఫిలిప్

0
26

బ్రిటన్ రాణి ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ రాజరిక బాధ్యతల నుంచి విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. వచ్చే సెప్టెంబర్ నుంచి ఆయన ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనబోరని బకింగ్‌హాం రాజభవనం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు రాణి పూర్తి మద్దతు ఉందని అందులో పేర్కొన్నారు. 95 సంవత్సరాల క్రికెట్ ప్రేమికుడైన ప్రిన్స్ ఫిలిప్ వయసు మీదపడ్డ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఆగస్టు వరకు ఇదివరకే ఖరారైన కార్యక్రమాలకు హాజరవుతారు. ఆ తర్వాత ఆయన పూర్తిగా విశ్రాంత జీవితం గడుపుతారు. బ్రిటన్ రాణి వెంట ఆయన మూడుసార్లు (1961, 1997, 2009) ఇండియాకు అధికారిక పర్యటనపై వచ్చారు. దేశానికి అందించిన సేవలకు గానూ ప్రజల తరఫున ప్రధాని థెరెసా మే ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే నవంబర్‌లో రాజదంపతుల 70వ వివాహ వార్షికోత్సవం జరుగబోతున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here