ప్రాణం తీసిన ఫేస్‌బుక్ ప్రేమ

0
22

ఫేస్‌బుక్ పరిచయం ఆ యువతికి ప్రాణాల మీదికి తీసుకొచ్చింది.. ఫేస్ బుక్‌ద్వారా పరియచమైన యువకుడు ఓ యువతిని దారుణంగా హత్య చేసి చివరకు భయాందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు .. రెండు రోజుల క్రితం నగరంలోని దొడ్డాపురం వీధిలో ఏన్న ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్‌లో దారుణ హత్యకు గురైన సంధ్య కేసులో అనుమానితుడిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి కాణిపాకంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుభాష్‌నగర్‌కు చెందిన దొరసామిరెడ్డి లీలావతి దంపతుల కుమార్తె సంధ్య(19) దొడ్డాపురం వీధిలోని డెంటల్ ఆస్పత్రిలో హత్యకు గురైంది. ఆమె మెడకు చున్నీ వేసి హత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం డెంటల్ ఆసుపత్రి డాక్టర్ కె.వి కిశోర్ కుమార్‌రెడ్డి క్లినిక్ వచ్చి చూడగా లోపల సంధ్య మృతదేహం పడివుంది. సమాచారం అందుకున్న ఈస్ట్ పోలీసులు ఘటనను పరిశీలించి హత్య కేసును నమోదు చేశారు.

LEAVE A REPLY