ప్రాజెక్టులపై సమీక్షలో మంత్రి హరీశ్‌రావు

0
24

సాగునీటి ప్రాజెక్టుల కోసం సేకరించే అసైన్డ్ భూములకు కూడా పట్టాభూములకు ఇచ్చినట్లుగా పరిహారం ఇవ్వాలని కలెక్టర్లను రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ప్రాజెక్టుల కోసం సేకరించదలచిన భూముల్లోప్రభుత్వ భూములు ఉన్నట్లయితే వాటి సేకరణ ప్రక్రియను 15 రోజుల్లో పూర్తిచేయాలని స్పష్టంచేశారు. ముంపుబాధితుల పట్ల సానుభూతితో, మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. డిండి, ఎలిమినేటి మాధవరెడ్డి, ఉదయసముద్రం, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సంగంబండ తదితర ప్రాజెక్టుల పనులపై మంత్రి బుధవారం జలసౌధలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ్యులు రామావత్ రవీంద్రకుమార్, బాలరాజు, భాస్కర్‌రావు, పీ ప్రభాకర్‌రెడ్డి, నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, కార్యదర్శి వికాస్‌రాజ్,
నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లు గౌరవ ఉప్పల్, రఘునందన్‌రావు, రోనాల్డ్‌రాస్, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, చీఫ్ ఇంజినీర్లు ఎస్.సునీల్, లింగరాజు, ఖగేందర్‌రావులతోపాటు వివిధ ప్రాజెక్టుల ఏజెన్సీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY