ప్రాజెక్టుపై బాబుది సవతి తల్లి ప్రేమ

0
6

లంచాల కోసమే కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన పోలవరంను చంద్రబాబు ప్రభుత్వం నిర్మిస్తోంది. ప్రాజెక్టుపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది’ అంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లాలో మూడోరోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మంగళవారం దెందులూరులో జరిగిన రైతు ఆత్మీయ సమ్మేళనంలో జగన్‌ ప్రసంగించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు డబ్బులు దండుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో విచ్చలవిడిగా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు కడుతున్నా చంద్రబాబు మాట్లాడలేకపోవడానికి కారణం ఓటుకు నోటు కేసేనని దుయ్యబట్టారు. అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఓటుకు నోటు కేసులో దొరికిపోయారని, అందువల్లే కేసీఆర్‌ను పల్లెత్తు మాట అనడం లేదని విమర్శించారు. దళారీ వ్యవస్థకు బాబు ఆద్యుడని, బినామీలకు మారుపేరు అని ఆరోపించారు. చంద్రబాబు ఇంటి బాత్‌రూమ్‌ సైజులో కూడా తమకు ఇళ్లు నిర్మించడం లేదని పోలవరం నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నట్లు జగన్‌ పేర్కొన్నారు. టీడీపీ పాలనలో ఏ పంటకూ మద్దతుధర లభించలేదని, కనీసం రొయ్యలకు కూడా గిట్టుబాటు ధర లేదని అన్నారు.

LEAVE A REPLY