ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు హఠాత్తుగా ఈ సినిమా సెట్స్ కి వచ్చారు.

0
11

రచయిత బీవీఎస్ రవి దర్శకుడిగా మారుతూ ‘జవాన్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఒక పాట .. ఒకటి .. రెండు సీన్స్ మాత్రమే పెండింగ్ లో వున్నాయి. ప్రస్తుతం ఆ సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. తాజాగా సాయిధరమ్ తేజ్ .. మెహ్రీన్ కాంబినేషన్ లో ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు హఠాత్తుగా ఈ సినిమా సెట్స్ కి వచ్చారు.

ఆయన అలా రావడం చాలా అరుదు కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆయనకి ఆహ్వానం పలుకుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా విశేషాలను గురించి అడిగి తెలుసుకున్న రాఘవేంద్రరావు .. సరదాగా ఒక షాట్ కి దర్శకత్వం వహించారు. యూనిట్ సభ్యులంతా ఆయనతో ఒక ఫోటో తీసుకుని ముచ్చట తీర్చుకున్నారు. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను నవంబర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో సాయి ధరమ్ తేజ్ వున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here