ప్రమాదకర మలుపును పరిశీలించిన మేయర్

0
12

బోయిన్‌పల్లి తాడ్‌బండ్‌ రోడ్డులోగల ప్రమాదకర మలుపును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న తదితరులు బుధవారం ఉదయం పరిశీలించారు. బోయిన్‌పల్లి తాడ్‌బండ్‌ రోడ్డులో గత రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఇదివరకు కూడా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో ప్రమాదకర మలుపును మేయర్‌తోపాటు ఎమ్మెల్యే సాయన్న తదితరులు బుధవారం ఉదయం పరిశీలించారు.

LEAVE A REPLY