ప్రమాదంలో ఆర్బీఐ ప్రతిష్ఠ!

0
16

కేంద్ర ప్రభుత్వ సిఫారసుతోనే తాము పెద్ద నోట్ల రద్దు చేశామని రిజర్వ్‌బ్యాంక్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం ఎవరిదన్న విషయంలో స్పష్టత వచ్చింది. అదే సమయంలో ఈ మొత్తం వ్యవహారంలో ఆర్బీఐ ప్రతిష్ఠ దెబ్బతిన్నదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిని కాపాడాల్సిన అవసరం ఉందని పలువురు రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్లు సైతం సూచిస్తున్నారు. నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాతి 50 రోజుల వ్యవధిలో ఆర్బీఐ మాట్లాడింది చాలా తక్కువ. ఒకటి రెండు దఫాలుగా బ్యాంకుల్లో జమ అయిన నోట్ల మొత్తాలను ప్రకటించింది తప్పిం చి.. నగదు విత్‌డ్రాయల్స్ పరిమితులు, ఆంక్షలు, చివరి రోజుల్లో కట్టుదిట్టం చేసే ప్రయత్నాలు, అనంతరం వాటిని ఉపసంహరించుకోవడాలు.. ఇలాంటివన్నీ వాస్తవానికి ఆర్బీఐ ద్వారానే జరుగాల్సి ఉంది. కానీ.. ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక శాఖ గుత్తకు తీసుకున్నట్టు వ్యవహరించడంతో ఈ విషయంలో కీలకమైన ఆర్బీఐ ప్రేక్షక పాత్రకే పరిమితమైందన్న అభిప్రాయాలు ఉన్నాయి.

LEAVE A REPLY