ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులివ్వండి

0
27

రాష్ట్ర ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు కల్పించేందుకు మార్గం సుగమమైంది. ఫిబ్రవరి 21లోగా ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు కల్పించి, తనకు నివేదిక సమర్పించాలని మంగళవారం హైకోర్టు ఆంధ్రప్రదేశ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. ప్రభుత్వ, పంచాయతరాజ్‌ టీచర్ల మధ్య రెండు దశాబ్దాలుగా ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ వివాదం నలుగుతోంది. వీటిపై 2003, 2007 సంవత్సరాల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మే 2007లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీం తిరస్కరించింది. 2015 సెప్టెంబర్‌ 30న ఎస్‌ఎల్‌పీని డిస్మిస్‌ చేసింది. సుప్రీంతీర్పును అమలు చేయాలంటూ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు వేసింది. వాదనలు విన్న న్యాయస్థానం ఫిబ్రవరి 21లోగా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. దాంతో రాష్ట్రపతి ఆమోదంతో ఏకీకృత సర్వీసు రూల్స్‌ అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. తీర్పును వెంటనే అమలు చేస్తూ డిప్యూటీ ఈవో, ఎంఈవోలు, గెజిటెడ్‌ హెడ్‌ మాస్టర్‌ పోస్టులు, డైట్‌ లెక్చరర్స్‌ పోస్టులను తక్షణం నింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తీర్పును అమలు చేస్తూ, పదోన్నతులు కల్పించి పూర్తి స్థాయి నివేదికను 21లోగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాని ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం గౌరవాధ్యక్షులు రమే్‌షరావు, అధ్యక్షులు సురేందర్‌, ప్రధాన కార్యదర్శి వీరాచారి, విశ్వనాధ్‌ గుప్తా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here