ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లడం లేదు

0
22

ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము వెళ్లడం లేదని, ప్రభుత్వంతో సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం పేర్కొన్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోల భవనంలో సుధీర్‌ కమిటీ నివేదిక అమలు చేయాలని కోరుతూ ఐకాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిం రిజర్వేషన్లపై సుధీర్‌ కమిటీ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఎవరి మీదో కోపంతో ఐకాస ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించడం లేదని తెలిపారు. తమపై ఆరోపణలు, ఒత్తిడిలు, బురద జల్లే ప్రయత్నం చేసినా ఓర్చుకుంటామన్నారు. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు కావాలని మొదటి నుంచి ఐకాస చెబుతోందన్నారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేలా పరిశీలన చేసేందుకు సమాన అవకాశాల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోదండరాం డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY