ప్రభాస్‌ చిత్రంలో బాలీవుడ్‌ నటులు?

0
16

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌.. సుజిత్‌ దర్శకత్వంలో నటించబోతున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో కీలక పాత్రల కోసం బాలీవుడ్‌ నటులు వివేక్‌ ఒబెరాయ్‌, జాకీ ష్రాఫ్‌లను ఎంపిక చేసినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. దీని గురించి జాకీ, వివేక్‌లతో సంప్రదింపులు జరిపారని త్వరలో చిత్రబృందం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సినిమా మూడు భాషల్లో తెరకెక్కనుండటంతో జాతీయ స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్న వివేక్‌, జాకీను తీసుకోనున్నారట. అదీకాకుండా వివేక్‌ ‘రక్తచరిత్ర’తో, జాకీ ష్రాఫ్‌ ‘పంజా’, ‘శక్తి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. హీరోయిన్‌ని కూడా బాలీవుడ్‌ నటినే ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారు. సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ మార్చి నెలాఖరు నుంచి ప్రారంభం కాబోతోంది. శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ ఈ సినిమాకి సంగీతం సమకూర్చనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here