ప్రధాన న్యాయమూర్తిగా రాధాకృష్ణన్‌

0
17

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాధాకృష్ణన్‌ కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ రాధాకృష్ణన్‌తో చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 1959 ఏప్రిల్‌ 29న జన్మించిన రాధాకృష్ణన్‌ కర్ణాటక కెజిఎఫ్‌ లా కళాశాల నుంచి ఎల్‌ఎల్‌బి పట్టా పొందారు. 2004లో కేరళ హైకోర్టు జడ్జిగా నియామకమైన రాధాకృష్ణన్‌ 2017 నుంచి ఛత్తీస్‌గఢ్‌ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవంలో సిఎం కెసిఆర్‌తో పాటు పలువురు మంత్రులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

LEAVE A REPLY