ప్రధాని మోదీపై దర్యాప్తునకు సుప్రీం నో

0
16

సహారా డైరీల కేసులో ప్రధాని నరేంద్రమోదీకి ఊరట లభించింది. ఆ పత్రాల ఆధారంగా దర్యాప్తుకు ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముడుపులు అందుకున్నట్టు సహారా డైరీల్లో సమాచారముందని, దీని ఆధారంగా సిట్‌తో దర్యాప్తు జరిపించాలని స్వచ్ఛంద సంస్థ కామన్‌కాజ్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు అరుణ్‌మిశ్రా, అమితావ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం కొట్టివేసింది. ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ పిటిషనర్ తరఫున చేసిన వాదనలను ధర్మాసనం తిరస్కరించింది. ప్రధాని మోదీతోపాటుగా పలువురు ఇతర రాజకీయ నేతల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చిన ఈ కేసులో తగినన్ని ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. అవి విశ్వసించదగ్గ ఆధారాలు కావని తేల్చి చెప్పింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిపై ఆమోదయోగ్యత లేని ఇలాంటి ఆధారాలతో దర్యాప్తునకు ఆదేశిస్తే వారు తమ పదవీ బాధ్యతలు నిర్వహించలేరు.

LEAVE A REPLY