ప్రధాని నివాసం ఎదుట ధర్నా చేద్దాం

0
20

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు కోసం అధికార, ప్రతిపక్ష ఎంపీలు కలిసికట్టుగా ప్రధాని నరేంద్రమోదీ నివాసం ఎదుట ధర్నా చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ అన్నారు. గుంటూరులో గురువారం జరిగిన సమితి రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీలు అరెస్టులకు భయపడవద్దని, వారి వెనుక రాష్ట్రప్రజల మద్దతుందని గుర్తుంచుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవి కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారని ఆరోపించారు. ప్రతిపక్షం కేవలం ఎన్నికల కోసమే ఉద్యమాలు చేయడం మానుకోవాలన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు రూ.24 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండు చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమ గీతాలకు రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. విదేశీ అప్పులతో నిర్మాణాలు చేపట్టడం ఆంధ్రుల ఆత్మగౌరవానికి భంగమని మండిపడ్డారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై భాజపా, తెదేపా ప్రభుత్వాలు నెరవేర్చని వాగ్దానాలు చేశాయని మండిపడ్డారు. సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY