ప్రధాని దృష్టికి తీసుకెళ్తా.. మోదీలాగే సీఎం కేసీఆర్ కష్టపడుతున్నారు

0
22

తెలంగాణ: పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కష్టపడుతున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ మంత్రి విజయ్ గోయల్ కొనియాడారు. మం గళవారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో మంగళవారం పర్యటించారు. డబుల్‌బెడ్‌రూం ఇండ్లను, వ్యవసాయ పనులను పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తక్కువ స్థలంలో తక్కువ ఖర్చుతో సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇండ్లు దేశానికి ఆదర్శంగా మారాయన్నారు. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా పేదల ఇండ్లను నిర్మించాలని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి అమలుచేసే ప్రయత్నం చేస్తానన్నారు. 600 డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మించడంలో సీఎం కేసీఆర్ చొరవ అద్భుతమన్నారు. దేశ ప్రజల కోసం ప్రధాని మోదీ కష్టపడుతుండగా రాష్ట్ర ప్రజల కోసం సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నారన్నారు.

LEAVE A REPLY