ప్రధానితో రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ టీం భేటీ

0
16

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలో పార్టీ ప్రతినిధివర్గం శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీని కలిసి అన్నదాతల వెతలను వినిపించింది. రుణాల మాఫీ ఆవశ్యకతను వివరించింది. ఇలా అప్పుడప్పుడూ కలుసుకుంటే బాగుంటుందని ప్రధాని నరేంద్రమోదీ రాహుల్‌తో అనడం గమనార్హం. రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధివర్గం పార్లమెంటు ఆవరణలో ప్రధానిని కలిసి రైతు సమస్యలను వివరించిన అనంతరం విపక్షాల్లో తర్జనభర్జనలు జరిగాయి. ఓ వైపు ప్రధాని మీద నోట్లరద్దు వ్యవహారంపై తీవ్రస్థాయిలో దాడిచేస్తున్న తరుణంలో ఇలా కాంగ్రెస్ ప్రతినిధివర్గం విడిగా వెళ్లి ఆయనతో భేటీకావడంపై విపక్షాల్లో లుకలుకలు బైలుదేరాయి.

LEAVE A REPLY