ప్రధానితో మహిళా ప్రజాప్రతినిధుల చర్చాగోష్ఠి

0
22

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 5, 6 తేదీల్లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మహిళా ప్రజాప్రతినిధులతో ప్రధాని మోదీ నిర్వహించనున్న చర్చాగోష్ఠిలో పాల్గొనేందుకు మెదక్‌ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా సర్పంచులకు ఆహ్వానం అందింది. వెల్దుర్తి మండలం ధర్మారం, అందుగులపల్లి గ్రామాలకు చెందిన సర్పంచులు మేళ్ల విజయ సత్యనారాయణగౌడ్‌, వడ్ల వసంతనర్సింలుకు ఈమేరకు ఆహ్వానం అందినట్లు ఈవోపీఆర్‌డీ జయపాల్‌రెడ్డి తెలిపారు. భారత రాజకీయాల్లో మహిళల పాత్ర అనే అంశంపై సలహాలు, సూచనలు ఇవ్వడానికి జరిగే చర్చలో వీరిద్దరు పాల్గొంటారు.

LEAVE A REPLY