ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దేశాన్ని రెండుగా విభజించారరు : రాహుల్‌గాంధీ

0
30

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దేశాన్ని రెండుగా విభజించారని, 99శాతం ఉన్న పేదలు, నిజాయితీపరులు, కష్టజీవులను విస్మరించి ఆయన 60శాతం సంపదను పోగేసుకున్న ఒక శాతం అత్యంత సంపన్నుల పక్షాన వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. అవినీతికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలనైనా కాంగ్రెస్ సమర్థిస్తుందని, కానీ ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు అందుకోసం కాదని, ఈ చర్య ఆర్థిక దోపిడీ అని ఆయన వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు అనేది అవినీతిపై సర్జికల్ స్ట్రయిక్ అని వారంటారు.

LEAVE A REPLY