ప్రత్యేక హోదాపై విశాఖ ర్యాలీ భగ్నం

0
14

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో యువత చేపట్టాల్సిన మౌనదీక్ష, కొవ్వొత్తుల ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు పట్ణంలో 144వ సెక్షన్ విధించి ముందస్తు అరెస్టులు చేశారు. ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన జగన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను విశాఖ ఎయిర్‌పోర్టు నుంచే హైదరాబాద్‌కు తరలించారు. విశాఖలో ఎక్కడికక్కడ వైసీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పవన్‌కల్యాణ్ అభిమానులను సైతం దిగ్భంధించి ర్యాలీ నిర్వహించకుండా నిషేధం విధించారు. విశాఖ ఆర్కేబీచ్ అంతా పోలీసులతో నిండిపోయింది. ర్యాలీకి వచ్చిన యువకులను అదుపులోకి తీసుకుని నగర శివారులోని గ్రామాల్లో వదిలేశారు.

రెండేళ్లలో సీఎం అవుతా.. మీ పని చెబుతా: వైఎస్ జగన్
రెండేళ్లలో సీఎం అవుతా. మీ పని అప్పుడు చెబుతా. మీ పేర్లన్నీ గుర్తుపెట్టుకుంటా. అందరి పనీ చెబుతా. ఎవ్వరినీ వదిలిపెట్టను అంటూ ఎయిర్‌పోర్టులో తనను అడ్డుకున్న పోలీసులపై వైసీపీ అధ్యక్షుడు జగన్ మండిపడ్డారు. గురువారం ఎయిర్‌పోర్టులో దిగిన వైసీపీ అధినేత జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబులను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి మద్దతు తెలిపేందుకు విశాఖ చేరుకున్న సినీనటుడు సంపూర్ణేష్‌బాబును పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాడినే అయినప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నా అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here