ప్రత్యేక హోదాపై నేడు బెంగళూరులో సదస్సు

0
6

‘ప్రత్యేక హోదా ఏపీ హక్కు’ అనే నినాదంతో కర్ణాటక తెలుగు ప్రజా సమితి ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక చర్చాగోష్టిని ఏర్పాటు చేస్తోంది. సమితి అధ్యక్షుడు డా.ఎం.బొందురామస్వామి, ప్రధాన కార్యదర్శి డి.బాబురాజేంద్రకుమార్‌ బెంగళూరులో శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్య అతిథులుగా చలసాని శ్రీనివాస్‌, నటుడు శివాజీ, తమ్మారెడ్డి భరద్వాజరెడ్డి తదితర ప్రముఖులు పాల్గొంటారన్నారు. మడివాళలోని అయ్యప్పస్వామిదేవస్థానం సమీపానగల గ్రాండ్‌ క్రిష్ణ హోటల్‌లో ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు సమావేశం జరుగుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here