ప్రతి అడుగు…విలక్షణం

0
25

తెలుగు చిత్రసీమలో వెంకటేష్ పంథాయే వేరు. తనదైన విలక్షణ నటనతో నిత్యనూతనంగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయడం ఆయన ట్రేడ్‌మార్క్‌గా చెబుతారు. సుదీర్ఘ నటప్రస్థానంలో ఎన్నో చిరస్మరణీయమైన విజయాల్ని సొంతం చేసుకున్నారాయన. హృదయానికి హత్తుకునే కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ హీరోగా ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకున్నారు. వినూత్న కథాంశాలపై మక్కువ, ప్రయోగాలకు వెరవని తత్వం ఆయన్ని అగ్రశ్రేణి నటుడిగా నిలబెట్టాయి. ఏదో ఒక ఇమేజ్ ఛట్రంలో ఇమిడిపోకుండా సమకాలీన భారతీయ సినిమాలో వస్తోన్న మార్పుల్ని స్వాగతిస్తూ నవ్యమైన ఇతివృత్తాలకు ప్రాధ్యానతనిస్తూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. అందుకే నాటి కలియుగ పాండవులు నుంచి నేటి బాబు బంగారం వరకు ఆయన జైత్రయాత్ర అప్రతిహతంగా సాగిపోతోంది. కేవలం నటుడిగానే కాదు వెంకటేష్‌లో గొప్ప ఆధ్యాత్మికవాది కనిపిస్తారు. ఎలాంటి ప్రతిఫలాపేక్షలేకుండా నిజాయితీగా పనిచేయడం వరకే మన బాధ్యత అని, మిగతా అన్ని విషయాల్ని ఆ విధికే వదిలేయాలంటారు. ఈ ఏడాది బాబు బంగారంతో విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన వరుస సినిమాలతో బిజీగా వున్నారు. ప్రస్తుతం ఆయన గురు చిత్రంలో నటిస్తున్నారు.

LEAVE A REPLY