ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డులు

0
15

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డులు అందుకున్న ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై వన్డే కెప్టెన్ ధోనీ అభిమానులు మండిపడుతున్నారు. కెరీర్‌లో ఎదగడానికి ఎంతో సాయం చేసిన ధోనీకి అశ్విన్ తన ప్రసంగంలో కృతజ్ఞతలు చెప్పకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, చీఫ్ కోచ్ కుంబ్లే, జట్టు సహచరులు, సహాయక సిబ్బంది, కుటుంబ సభ్యులందర్నీ గుర్తు చేసుకున్న అశ్విన్.. ఒక్కసారి కూడా ధోనీ పేరును తలువకపోవడంతో అభిమానులు ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అశ్విన్ ఓ దుష్టుడు అంటూ చాలా మంది ట్వీట్ చేయగా, అశ్విన్ ఇప్పుడు అనుభవిస్తున్న హోదాకు మహీయే కారణమని మరికొంత మంది గుర్తు చేశారు

LEAVE A REPLY