ప్రతిపాదించి వెనక్కి తగ్గిన కేంద్రం

0
21

అంతరిక్ష రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న ఇస్రోకు కేంద్రం అడ్డుపడుతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే.. భవిష్యత అవసరాల దృష్ట్యా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన అంతరిక్ష కేంద్రంలో మూడో లాంచప్యాడ్‌ నిర్మించాలని భావించిన కేంద్రం ఇప్పుడు వెనక్కి తగ్గింది. ఈ ప్రతిపాదనను విరమించుకుంటామని పార్లమెంటుకు తెలిపింది. దీన్ని రమేష్‌ పోఖ్రియాల్‌ అధ్యక్షుడిగా ఉన్న ప్రభుత్వ హామీలపై కమిటీ అంగీకరించలేదు. మూడో లాంచ్‌ ప్యాడ్‌ నిర్మాణ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలనుకుంటున్న అంతరిక్ష శాఖ తీరును ఈ కమిటీ తప్పుబట్టింది. దేశ, ప్రపంచ అంతరిక్ష ఆకాంక్షలను అర్థం చేసుకుని, ముందుచూపుతో వ్యవహరించాలని హితవు పలికింది. మూడో లాంచప్యాడ్‌ను నిర్మించకుండా ఇస్రోను కేంద్రం కట్టడి చేయరాదని స్పష్టం చేసింది. గొప్ప ప్రాజెక్టులకు వనరుల కొరత అనేది ఉండరాదని, సాంకేతిక సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని తెలిపింది.

LEAVE A REPLY