ప్రతిపక్షాలు సభకు రావాలని శాసనసభలో సీఎం కేసీఆర్ విజ్ఞప్తి

0
17

తెలంగాణ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాల పాత్ర చాలా గణనీయమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాలపై ఎంతో గౌరవం ఉన్నదని, ప్రతిపక్ష సభ్యులు సభకు రావాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణ బిల్లు-2016 బిల్లుపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం సభ్యులు సభకు రాకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ప్రతిపక్షాలంటే మాకు ఎంతో గౌరవం ఉన్నది. మంచి సూచనలు ఇస్తే తప్పక తీసుకునే అలవాటు మా ప్రభుత్వానికి ఉన్నది. మొండిగా పోదామని మాకేం లేదు. కాంగ్రెస్ పార్టీవారితోపాటు ఇంకొన్ని పార్టీలు నిరసన వ్యక్తం చేసినట్టు తెలిసి బాధ అనిపించింది. అట్లా పోవాల్సిన అవసరం లేదు. నా అభ్యర్థన ఒక్కటే. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం రావడం, అధికారం పోవడం సాధారణంగా జరిగే ప్రక్రియ. ఎవరైనా సరే దాన్ని స్పోర్టివ్ స్పిరిట్‌తో తీసుకోవాలి. సందర్భాన్ని బట్టి ప్రజలు అధికారం ఇస్తారు.

LEAVE A REPLY