ప్రతిపక్షాలపై వ్యాఖ్యలు గర్హనీయం.. పార్లమెంట్‌లో సభ్యుల ఆందోళన

0
26

వరుసగా ఏడో రోజు పార్లమెంట్ సమావేశాలు తుడిచి పెట్టుకుపోయాయి. ఒక్క అంశంపై కూడా చర్చ జరుగలేదు. పెద్ద నోట్ల రద్దుపై జరిగే చర్చలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనాలని ప్రతిపక్షాలు ఇప్పటివరకు
పట్టుపట్టగా.. శుక్రవారం ఢిల్లీలోని ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రతిపక్షాలపై మోదీ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ ఉభయసభలను కుదిపేశాయి. ఈ అంశంపై తక్షణమే క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షాలు దుమారం రేపాయి. ఈ క్రమంలో పార్లమెంట్ సోమవారానికి వాయిదా పడింది.పార్లమెంట్ సమావేశాలు మరోసారి ఎలాంటి చర్చ జరుగకుండానే వాయిదాపడ్డాయి. వరుసగా ఏడోరోజు చర్చ జరుగకపోవడంపై లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ ఉభయ సభలను శుక్రవారం కుదిపేశాయి. తక్షణమే ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. అయితే, అధికారపక్షం అందుకు ససేమిరా అనడంతో పార్లమెంట్‌లో గందరగోళం నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే సమావేశాలు సోమవారానికి వాయిదాపడ్డాయి. ఢిల్లీలోని ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకొనేందుకు ప్రభుత్వం తగినంత సమయం ఇవ్వనుందునే కొంతమంది నోట్లరద్దు విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. తమను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, వామపక్షాలు లోక్‌సభ, రాజ్యసభలో ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు

LEAVE A REPLY