ప్రణబ్ ముఖర్జీకి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, ఘనస్వాగతం

0
23

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శీతాకాల విడిది కోసం గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. గురువారం సాయంత్రం 5.30 గంటలకు హకీంపేట వైమానికదళ విమానాశ్రయంలో రాష్ట్రపతి ప్రత్యేక విమానం ల్యాండ్ అయ్యింది. వైమానిక దళ ప్రత్యేక విమానంలోంచి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సరిగ్గా సాయంత్రం 5.45 గంటలకు కిందకు దిగారు. రాష్ట్రపతి రాక కోసం వేచి చూస్తున్న గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం కే చంద్రశేఖర్‌రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ ఎస్ మధుసూధనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు, సీఎస్ ప్రదీప్‌చంద్ర, డీజీపీ అనురాగ్‌శర్మ, సీనియర్ అధికారులతోపాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి కాళ్లకు నమస్కరించారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ శాలువా కప్పి ఆహ్వానించారు.

LEAVE A REPLY