ప్రజల కష్టాలనూ ఆలోచించాలి

0
32

పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయం యావత్తు దేశంపైనా ఉన్నదని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అన్నారు. దేశ విశాల ప్రజానీకానికి ఉపయోగపడేదిగా, విస్తృత ప్రయోజనాలు సాధించే విధంగా ఉంటే దీన్ని తప్పకుండా స్వాగతిస్తామని చెప్పారు. ఈ నిర్ణయం వలన సామాన్యులు, రైతులు, కూలీలు, అసంఘటితరంగం కార్మికులు పడే ఇబ్బందులకు తగిన పరిష్కారం ఉండాలని అన్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వీలైనంత త్వరగా రూపుమాపే ప్రత్యామ్నాయాల్ని అన్వేషించాలని సూచించారు. మొసళ్ళ కోసం చేపలను ఎండబెట్టే విధంగా నిర్ణయం, అమలు ఉండరాదని అన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో తెలంగాణ స్టేట్ డే సందర్భంగా పెవిలియన్‌ను సందర్శించి మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్ళడం ఒక బాధ్యతాయుతమైన కార్యక్రమమని అన్నారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ప్రధానితో భేటీ అయ్యారని చెప్పారు. ఈ నిర్ణయం ఒక్కో సెక్షన్ ప్రజలపై ఏ విధంగా పడుతుందో, ఒక్కో రంగంపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతుందో వివరించామని తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో మహిళలు, సామాన్యులు, రైతులు, కూలీలు, అసంఘటిత కార్మికులు, చిరువ్యాపారులు.. ఇలా వివిధ సెక్షన్ల ప్రజలు రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వాటిని అధిగమించడానికి తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here