ప్రజలను అప్రమత్తం చేయండి : చంద్రబాబు

0
3

తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. బుధవారం రాత్రి ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, పోలీస్, విపత్తు నిర్వహణశాఖ అధికారులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని సహాయచర్యల్లో ఏ మాత్రం అలసత్వం వహించరాదన్నారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 5.30 గంటల లోపు తీరాన్ని తాకే సమయంలోనే అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.

LEAVE A REPLY