ప్రచారానికి నేడే ఆఖరు

0
10

ఉత్కంఠ భరితంగా సాగుతున్న కర్ణాటక ఎన్నికల పోరులో మరో ముఖ్య ఘట్టం ముగుస్తోంది. ఈసీ ఆదేశాల మేరకు బహిరంగ ప్రచారానికి గురువారం సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. రాష్ట్రంలోని 223 నియోజకవర్గాలకు ఈ నెల 12వ తేదీ ఎన్నికలు జరుగనున్నాయి. జయనగర ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి బీకే విజయకుమార్‌ ఆకస్మిక మరణంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడడం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా గత 20 రోజులుగా ప్రచారం హోరెత్తింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఈ ఫలితాలు దిక్సూచి కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రాణం పెట్టి పోరాడుతున్నాయి. ఆయా పార్టీల అధినేతలు పోటాపోటీగా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. కన్నడ పోరు యావత్‌ భారత్‌ను ఆకర్షించింది. ఇప్పటివరకు వచ్చిన పలు సర్వేల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ చెబుతుండడంతో ప్రధాన పార్టీల్లో ఉలుకు మొదలుకాగా, కింగ్‌మేకర్‌ను అనుకుంటూ జేడీఎస్‌ లోలోన ఆనందిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here