పోస్టాఫీస్ పేమెంట్ బ్యాంక్ సేవలు ఆరంభం

0
18

ప్రభుత్వరంగ సంస్థ పోస్టాఫీస్..పేమెంట్ బ్యాంక్ సేవలను ఆరంభించింది. పైలెట్ సేవల్లోభాగంగా రాయపూర్, రాంచిల్లో సోమవారం ఈ సేవలను ఆరంభించింది. సెప్టెంబర్ చివరినాటికి దేశవ్యాప్తంగా 650 శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.800 కోట్ల ఈక్విటీ నిధుల్లో ఇప్పటికే రూ.275 కోట్ల నిధులు వచ్చాయని ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్(ఐపీపీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఏపీ సింగ్ తెలిపారు.. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక పేమెంట్ శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు, దేశవ్యాప్తంగా ఉన్న 1.55 లక్షల పోస్టాఫీస్‌లు ఇకనుంచి ఐపీపీబీ పరిధిలోకి రానున్నాయన్నారు.

LEAVE A REPLY