పోలీసులను దాటుకొని ప్రాజెక్టు వైపు నాలుగు గంటపాటు తీవ్ర ఉద్రిక్తత

0
16

పోలవరం ప్రాజెక్టు పనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. ప్రాజెక్టుకు చెందిన వాహనాలను నాలుగు గంటలకుపైగా నిలువరించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ 50 రోజులుగా ప్రాజెక్టు నిర్వాసితులు పోలవరంలో రిలే దీక్షలు చేస్తున్నారు. శనివారం వారంతా కాలినడకన పోలవరం నుంచి ప్రాజెక్టువైపు తరలివెళ్ళారు. ప్రాజెక్టు ముఖ ద్వారం వద్ద అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. తమ సంఖ్య తక్కువగా ఉండటంతో ఆందోళనకారులను నిలువరించలేకపోయారు. నిర్వాసితులు ఒక్కసారిగా ప్రాజెక్టు నిర్మాణ స్థలంవైపు దూసుకెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు రెండు వాహనాలను దారికి అడ్డంగా పెట్టారు. నిర్వాసితులను వెనక్కి పంపించేందుకు ప్రయత్నించారు.

LEAVE A REPLY