పోలవరానికి తొలగిన ప్రధాన అడ్డంకి

0
29

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. వచ్చే నెల 2 లేదా 3వ తేదీన ప్రాజెక్టు తుది డిజైన్లను ఆమోదిస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారులకు పోలవరం డిజైన్ల సమీక్ష కమిటీ చైర్మన్‌, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ పాండ్యా హామీ ఇచ్చారు. దీంతో.. డిసెంబరు రెండో వారం నుంచి ప్రారంభించదలచిన కాంక్రీట్‌ పనులకు ప్రధాన అవరోధాలు తొలగిపోయాయి. దీంతో కాంక్రీట్‌ పనులు చేపట్ట వచ్చంటూ కేంద్ర జల సంఘం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇక, ఇంతకాలం డిజైన్ల కోసం ఆందోళన చెందిన రాష్ట్ర జల వనరులశాఖ ఊపిరి పీల్చుకుంది. ఢిల్లీలోని కేంద్ర జలవనరుల సంస్థ కార్యాలయంలో మంగళవారం పోలవరం డిజైన్ల కమిటీ సమావేశం జరిగింది. దీనిలో.. డిజైన్లను ఆమోదించాల్సిన ప్రధాన సంస్థల అధికారులం తా పాల్గొని.. డిజైన్లను ఆమోదించడంతో.. రాష్ట్ర అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అత్యంత కీలకమైన స్పిల్‌ వే డిజైన్‌కు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. గత నెలలో జరిగిన సమావేశంలో.. స్పిల్‌వే మోడల్‌ను డిజైన్‌ సమీక్ష కమిటీ పరిశీలించింది. ఈ మోడల్‌ పరిశీలించాక.. కొన్ని మార్పులు చేర్పులు చేసింది. వాటిని రీడిజైన్‌ చేసి సమర్పించడంతో.. సీడబ్ల్యూసీ ఈ సమావేశంలోనే వాటిని ఆమోదించింది. అదేవిధంగా డయాఫ్రమ్‌ వాల్‌ డిజైన్‌ విషయంలోనూ సీడబ్ల్యూసీ గ్రీన్‌ సిగ్న ల్‌ ఇచ్చింది. ఈ డిజైన్లకు సంబంధించి సీడబ్ల్యూసీ, రివ్యూ కమిటీ లేవనెత్తిన పలు సందేహాలను జర్మనీకి చెందిన బావర్‌ కంపెనీ ప్రతినిధి పీటర్‌ నివృత్తి చేశారు. దీంతో.. డయాఫ్రం వాల్‌ నిర్మా ణం డిజైన్లకూ ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో హైడల్‌ పవర్‌ హౌస్‌ పునాదికి.. సీడబ్ల్యూసీ సమ్మతి లభించింది. దీంతో పోలవరం నిర్మాణం పరుగులు పెట్టనుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here