పోరాడి ఓడిన సింధు

0
27

దుబాయ్: రెండో గేమ్‌లో అసమాన ఆటతీరు.. క్రాస్ కోర్టు ర్యాలీల్లో తిరుగులేని ప్రదర్శన.. బేస్‌లైన్ గేమ్‌లో పవర్ హిట్టింగ్ షాట్స్.. ముఖాముఖి రికార్డులో పైచేయి… అయినా వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో ఇవేవీ సింధును కాపాడలేకపోయాయి. తనకంటే మెరుగైన ప్రత్యర్థి కోర్టులో పాదరసంలా కదులుతూ పన్నిన దుర్బేధ్యమైన పన్నాగం ముందు హైదరాబాద్ అమ్మాయి జయించలేకపోయింది. దీంతో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సుంగ్ జీ హున్ (కొరియా) 21-15, 18-21, 21-16తో సింధుపై నెగ్గి తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. 76 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో.. తొలి గేమ్‌లో సింధు కాస్త అలసత్వాన్ని ప్రదర్శించింది. దీంతో కొరియా అమ్మాయి 11-9, 14-11 ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో సింధు కాస్త పుంజుకునే ప్రయత్నం చేసినా ఒక్కో పాయింట్‌కే పరిమితం కావడంతో గేమ్‌ను చేజార్చుకుంది.

LEAVE A REPLY