‘పోకెమాన్‌ గో’కు చైనా బ్రేక్‌ !!

0
22

గతేడాది సంచలనం సృష్టించిన ‘పోకెమాన్‌ గో’ స్మార్ట్‌ఫోన్‌ గేమ్‌కు చైనాలో బ్రేక్‌ పడింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆ గేమ్‌కు అనుమతి ఇవ్వడంలేదని చైనా సెన్సార్‌ విభాగం తేల్చి చెప్పింది.

ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ గేమ్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే.. ఈ గేమ్‌ ఆడుతూ చాలామంది ప్రమాదాల బారిన పడ్డ ఘటనలు ఉన్నాయి. రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం.. సిగ్నళ్లను బ్రేక్‌ చేయడం వంటివి చోటుచేసుకున్నాయి. కొందరు గేమ్‌లోని పోకెమాన్లను వెతుక్కుంటూ దేశాల సరిహద్దులు దాటిన దాఖలాలూ ఉన్నాయి. అలా రవాణా వ్యవస్థకు.. వినియోగదారుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టే గేమ్‌లకు అనుమతి ఇవ్వమని చైనా అధికారులు చెబుతున్నారు. ప్రమాదకర ఫీచర్లను తొలగిస్తే ఆలోచిస్తామని సూచిస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్‌.. ఆన్‌లైన్‌ గేమింగ్‌ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న చైనాలో అడ్డంకులు ఏర్పడటం ‘పోకెమాన్‌ గో’కు సవాల్‌ లాంటిదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here