పేస్‌ ఆగాల్సిందే..

0
26

ప్రపంచ రికార్డు ముంగిట సొంతగడ్డపై లియాండర్‌కు అనుకోని దెబ్బ. రెండోరోజే కివీస్‌ కథ ముగించాలని భావించిన భారత్‌కు నిరాశ. డబుల్స్‌లో లియాండర్‌ పేస్‌-విష్ణువర్దన్‌ జోడీ ఓడిపోయింది. శనివారం హోరాహోరీ సాగిన సమరంలో సిటెక్‌-వీనస్‌ 3-6, 6-3, 7-6 (8-6), 6-3తో పేస్‌ జంటపై గెలిచి కివీస్‌ను 1-2తో మ్యాచ్‌లో నిలిపింది. ఈ మ్యాచ్‌లో ఆరంభం పేస్‌ జోడీదే. సర్వీసులతో అదరగొట్టిన భారత ద్వయం ఆరో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి 28 నిమిషాల్లో 6-3తో తొలి సెట్‌ గెలుచుకుంది. ఐతే రెండో సెట్లో కివీస్‌ జోడీ పుంజుకుంది. పేస్‌ సర్వీస్‌లో బ్రేక్‌ సాధించిన వీనస్‌ జంట ఆ తర్వాత 6-3తో సెట్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. ఇరు జోడీలు హోరాహోరీ తలపడడంతో మూడో సెట్‌ టైబ్రేకర్‌కు మళ్లింది. టైబ్రేకర్‌లోనూ పోటాపోటీయే! ఒక దశలో స్కోరు 6-6తో సమమైంది. ఈ స్థితిలో భారత జోడీ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన కివీస్‌ జంట ఆపై 8-6తో నెగ్గి సెట్‌ను దక్కించుకుంది. రెండు సెట్లు సాధించిన వూపులో నాలుగో సెట్‌ రెండో గేమ్‌లోనే భారత జంట సర్వీస్‌ బ్రేక్‌ చేసింది కివీ జోడీ. ఎనిమిదో గేమ్‌లో భారత ద్వయం మ్యాచ్‌ పాయింట్‌ను కాచుకున్నా…ఆ తర్వాత సిటెక్‌ కొట్టిన విన్నర్‌తో కివీస్‌ విజయాన్ని అందుకుంది. దీంతో డేవిస్‌కప్‌ డబుల్స్‌ ప్రపంచరికార్డు సాధించాలనుకున్న లియాండర్‌ పేస్‌ (42 విజయాలు)కు మరికొంత కాలం నిరీక్షణ తప్పదు. ఆదివారం జరిగే కీలక రివర్స్‌ సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో రామ్‌కుమార్‌ రామనాథన్‌.. టియర్‌నెతో తలపడనుండగా.. జోస్‌ సాంథమ్‌తో యుకి బాంబ్రి పోటీపడతాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here