పేపర్ ఇటుకలుగా పాత నోట్లు!

0
17

బ్యాంకుల్లో భారీ స్థాయిలో జమ అవుతున్న పాత నోట్లను పలు ప్రాంతాల్లో ఉన్న ఆర్బీఐ శాఖలకు తరలిస్తున్నారు. సుమారు 15వేల మిలియన్ల వరకు వచ్చి చేరే అవకాశమున్న ఈ పెద్ద నోట్లను ఏం చేయబోతున్నారన్న సందేహం సర్వత్రా వ్యక్తమవుతున్నది.

-ఆర్బీఐ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2015-2016)లో మార్కెట్‌లో చెల్లుబాటు కాని 625 మిలియన్ల వెయ్యి రూపాయల నోట్లు, 2,800 మిలియన్ల 500 రూపాయల నోట్లను ధ్వంసం చేశారు.
-గత మార్చి చివరి నాటికి రూ.500 నోట్లు 15,707 మిలియన్లు, వెయ్యి రూపాయల నోట్లు 6,326 మిలియన్లు ప్రజల వద్ద ఉన్నాయి. వీటిలో కనీసం 70% తిరిగి రిజర్వు బ్యాంకుకు చేరినా అవి 15,000 మిలియన్లకు పైగా ఉంటాయి.
-దేశవ్యాప్తంగా ఆర్బీఐకి నోట్లను తనిఖీ చేసి ధ్వంసం చేసే కేంద్రాలు 19 ఉన్నాయి. ఇవి తమ వద్దకు వచ్చే మురికినోట్లను తనిఖీ చేసి వాటి నుంచి నకిలీ నోట్లను వేరుచేసి మిగిలిన వాటిని ధ్వంసం చేస్తాయి.
-నోట్లను ధ్వంసం చేసే యంత్రాలను ఆర్బీఐ జపాన్ లేదా జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నది. ఇవి గంటకు 2.50 లక్షల నోట్లను ధ్వంసం చేస్తాయి.
-భారీ స్థాయిలో వచ్చి పడుతున్న పాత నోట్లను ధ్వంసం చేసేందుకు అన్ని కేంద్రాలలో తాము రెండు షిఫ్టులలో పనిచేయాల్సి ఉంటుందని ఆర్బీఐకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. ఇటువంటి సవాలు ఎదురుకావడం ఆర్బీఐకి ఇదే మొదటిసారి అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here