పేదోడికి నేరుగా పింఛన్‌

0
5

ఒకవైపు సీఎం టెలీకాన్ఫరెన్స్‌లు! దీనికి పోటాపోటీగా మంత్రులు, కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లు! ఇప్పుడు వీటి నుంచి ‘పాక్షిక ఉపశమనం’ లభించింది. ఎప్పుడు పడితే అప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టొద్దని… వారానికి ఒక్కసారి మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక… జన్మభూమి కమిటీలపై ఫిర్యాదుల నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. పింఛను లబ్ధిదారుల ఎంపికలో ఈ కమిటీల ప్రమేయాన్ని తొలగించింది. ‘టెలీకాన్ఫరెన్స్‌లు వద్దు. జన్మభూమి కమిటీలు వద్దేవద్దు’ అని ఎంపీ జేసీ మొరపెట్టుకున్న మరుసటి రోజే ఈ ఆదేశాలు వెలుగుచూడటం యాదృచ్ఛికమే కావొచ్చు!

LEAVE A REPLY