పెరిగిన వంట గ్యాస్‌ ధరలు…

0
15

కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. అన్ని కంపెనీల వంట గ్యాస్‌కు పెరిగిన ధరలు వర్తిస్తాయి. ఊహించని విధంగా పెరిగిన గ్యాస్‌ ధర వినియోగదారులపై భారం పడుతున్నా తప్పని పరిస్థితి అని ఆయా కంపెనీల గ్యాస్‌ డీలర్లు పేర్కొంటున్నారు. ఇదివరకు ఉన్న ధర కంటే అదనంగా గృహావసరాలకు సంబంధించిన వంట గ్యాస్‌ 14.2 కిలోల సిలిండర్‌ (డొమెస్టిక్‌)పై రూ. 71.5 కాగా కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.110.5 వరకు పెరిగింది.

వంటగ్యాస్‌ ధరలు ఇలా..
వంటగ్యాస్‌              పాత ధర                             కొత్త ధర

డొమెస్టిక్‌ సిలిండర్‌ రూ. 663.00                        రూ. 734.50
కమర్షియల్‌         రూ. 1223.00                      రూ. 1333.500

LEAVE A REPLY