పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో 50 రోజుల గడువు ముగిసిన తర్వాత

0
31

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత అనేక కష్టాలు పడిన దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపట్ల వారి సహకారానికి, మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని చరిత్రాత్మకమైన శుద్ధి క్రతువుగా అభివర్ణించిన మోదీ.. దీపావళి తర్వాత ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారని అన్నారు. ఈ క్రమంలో అనేక ఇబ్బందులు, కష్టాలు, బాధలు చిరునవ్వుతో అనుభవించారని చెప్పారు. త్యాగానికి అర్థాన్ని పునర్నిర్వచించారని అన్నారు. మెజార్టీ ప్రజలు దేశం అవినీతి రొంపి నుంచి బయటపడాలని కోరుకున్నారని అన్నారు. దేశంలో నల్లధనాన్ని, ఉగ్రవాదాన్ని, నకిలీ కరెన్సీని నిర్మూలించేందుకు 50 రోజులు గడువు ఇవ్వాలని నవంబర్ 8న విజ్ఞప్తి చేసిన మోదీ.. ఆ గడువు ముగిసిన తర్వాత శనివారం రాత్రి నూతన సంవత్సర ఆరంభం నేపథ్యంలో టెలివిజన్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

LEAVE A REPLY