పెద్ద నోట్లు దేశానికి మంచిది కాదు!

0
23
పెద్దనోట్లు చలామణిలో ఉండటం దేశానికి మంచిది కాదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ భవనలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు గురించి తనకు ముందే తెలుసన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ఐదేళ్ల కిందటే తాను పెద్దనోట్ల రద్దును డిమాండ్‌ చేశానని చంద్రబాబు గుర్తు చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయాలని దేశం మొత్తం మీద కోరింది తాను మాత్రమేనన్నారు. నిజంగా పెద్ద నోట్ల రద్దు గురించి ముందుగానే తనకు చెప్పినట్లయితే తనకు తెలిసిన మంచి ఆలోచనల్ని కేంద్రానికి ఇచ్చేవాడినన్నారు. అంతకు మించి తానేం చేసుకోగలనని నవ్వుతూ వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు, కొత్త నోట్ల మార్పిడి ప్రక్రియను ఇంకా బాగా అమలు చేయవచ్చునని, అందుకు అవకాశాలు ఉన్నాయని.. అయితే ఇది రహస్యంగా చేయాల్సిన విషయమన్నారు.

LEAVE A REPLY