పెద్దనోట్ల రద్దుతో ప్రజలకు ఎదురైన కష్టాలను తీర్చాలి : సీఎం కేసీఆర్

0
27

నగదురహిత లావాదేవీలను నిర్వహించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఉండాలన్న కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ లక్ష్యం దిశగా ముందుకెళ్లటంపై చర్చించటం కోసం రాష్ట్రమంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. సమావేశం అనంతరం.. పెద్దనోట్ల రద్దు తరువాత జరిగిన పరిణామాలు, తలెత్తుతున్న పరిస్థితులు, ప్రజల ఇబ్బందులను పరిష్కరించటానికి తీసుకునే చర్యలు తదితర అంశాలపై కేబినెట్ సమావేశ నిర్ణయాలను సీఎం కేసీఆర్ స్వయంగా మీడియాకు వివరించనున్నట్లు సమాచారం. పెద్దనోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు, సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి.. అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.

LEAVE A REPLY