పెండ్లుంటే నాకేంది.. రెండు వేలే ఇస్తా!

0
29

పెద్దనోట్ల రద్దు పేరుతో ప్రజల బ్యాంకు ఖాతాలను చాలామటుకు స్తంభింపజేసిన కేంద్ర ప్రభుత్వం జనం హాహాకారాలు చేయడంతో పెండ్లికి మాత్రం రెండున్నర లక్షల రూపాయల వరకు ఖాతాల నుంచి తీసుకోవచ్చునని ప్రకటించిన సంగ తి తెలిసిందే. అయితే చాలా బ్యాంకులు సర్కారు వారు ఇచ్చిన ఈ ఆదేశాన్ని సక్రమంగా పాటించడం లేదు. సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామానికి చెందిన జానకంపేట ప్రమీల తన కొడుకు పెండ్లి నేపథ్యంలో ఖాతాలో ఉన్న రూ.55వేలను తెచ్చుకుందామని ఏపీజీవీబీ బ్యాంకుకు వెళ్లింది. గంటసేపు క్యూలో నిలబడింది. లోపలికి వెళ్లాక పెండ్లి పత్రికను చూపిస్తూ ఈ నెల 4న నా కొడుకు పెండ్లి ఉన్నది సారూ.. జర నా పైసలు నాకు ఇయ్యిండ్రి అని వేడుకున్నది. అందుకు ఆ బ్యాంకు అధికారి కసురుకున్నాడు. మీ ఇంట్ల పెండ్లి ఉంటే నేనేం జెయ్యాలె… రెండు వేలే ఇస్తా తీస్కపో అన్నాడు. ఖర్చులకు సరిపోవు సారూ.. పది వేలైనా ఇయ్యిండ్రి బాంచన్ అని ఆమె ప్రాధేయపడినా అతని మనసు కరుగలేదు. జానకమ్మ బయటికి వచ్చాక తన కష్టం గురించి అక్కడున్న వారికి చెప్తూ కన్నీరుమున్నీరైంది. చేతిల పైసలు లేవు కొడుకు పెండ్లి ఎట్ల జెయ్యాలె అంటూ బాధపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here