పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు

0
72

మహిళల దినోత్సవాన్ని పురుషుల దినోత్సవంగా మార్చేశాడు సినీదర్శకుడు రాంగోపాల్‌ వర్మా. దానికి కారణాన్ని కూడా ఆయన విశ్లేషించారు. ‘‘ఏడాదిలో అన్నీ రోజులు పురుషులవేనని.. ఈ ఒక్కరోజు మహిళకు ఇచ్చారు. ఉమెన్స్‌ డే’ని ‘మెన్స్‌ డే’ అనాలి. మహిళలను పురుషులు సంతోష పెట్టినంతగా.. పురుషులను మహిళలు సంతోషపెట్టలేరు. కనీసం పురుషుల దినోత్సవం రోజైనా మహిళలు వారిపై అరుపులు, కేకలు వేయకూడదు. వారికి కొంచెం స్వేచ్ఛనివ్వాలి. పురుషుల అందరి తరఫు నుంచి నేను మహిళలకు పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఆ రోజు పురుషులు మహిళలకు ఏం చేయాలో నాకు తెలియదు.. కానీ ఏడాదిలో ఒక రోజు మాత్రం పురుషులు మహిళల దినోత్సవంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను.’’అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

LEAVE A REPLY