పీబీఎల్‌లో సింధు బృందం శుభారంభం

0
23

ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్)లో చెన్నై స్మాషర్స్ బోణీ కొట్టింది. తమ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ చేతిలో ఓటమిపాలైన చెన్నై.. మంగళవారం బెంగళూరు బ్లాస్టర్స్‌ను 5-0 తేడాతో చిత్తుచేసింది. స్టార్ షట్లర్ పీవీ సింధు..చెన్నై ఘనవిజయంలో కీలకంగా వ్యహరించింది. కరోలినా మారిన్ చేతిలో ఎదురైన ఓటమిని మరిపిస్తూ బెంగళూరు ప్లేయర్ చుయాంగ్‌ను వరుస సెట్లలో మట్టికరిపించింది. తొలుత పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో పారుపల్లి కశ్యప్ 11-8, 11-5తో సౌరభ్ వర్మను ఓడించాడు. తన అనుభవాన్నంతా రంగరిస్తూ కశ్యప్ మ్యాచ్‌ను అలవోకగా దక్కించుకున్నాడు. దీంతో చెన్నై ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత జరిగిన ట్రంప్ మ్యాచ్‌లో సింధు 12-10, 11-6తో చయాంగ్‌ను ఓడించింది. మొదటి గేమ్‌లో కొంత వెనుకబడ్డ సింధు ఆ తర్వాత కసిగా పుంజుకుని వరుస పాయింట్లు కొల్లగొట్టింది. పదునైన స్మాష్‌లకు తోడు డ్రాప్ షాట్లు, నెట్‌గేమ్‌తో ప్రత్యర్థిని పడగొట్టింది.చుయాంగ్ కూడా దీటుగా సమాధానం ఇవ్వడంతో గేమ్ హోరాహోరీగా సాగింది. చివరకు తొలి సెట్‌ను 12-10తో కైవసం చేసుకున్న ఈ హైదరాబాదీ..రెండో సెట్‌లో మరింత రెచ్చిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here