పింఛన్లు వస్తున్నయా..?

0
24

ఏందవ్వా? మంచిగున్నవా? పింఛన్ పైసలు టైంకు వస్తున్నయా? జర లేటుగా వస్తున్నయా? ఆఫీసులకు పోతే అధికారులు ఏమైనా సతాయిస్తున్నరా? నోట్ల బందుతో ఏమైనా గోస అయితున్నదా? ఇది కండ్లకోయ మహిళలతో ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు కలుపుగోలుగా జరిపిన ముచ్చట ఇది. సోమవారం మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయ గ్రామంలో ధ్రువ కాలేజీ ప్రారంభోత్సవానికి వెళ్లిన సందర్భంగా ఆ గ్రామంలోని పలువురు మహిళలు, వృద్ధులతో మంత్రి కేటీఆర్ పైవిధంగా ముచ్చటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులపై మాట్లాడారు. గ్రామానికి చెందిన డప్పు పోచమ్మ స్పందిస్తూ గతంలో వలే ఇబ్బందులు లేకుండా సమయానికి పింఛన్ అందుతున్నదని తెలిపింది. డబుల్ బెడ్రూం ఇళ్లు కావాలని మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. కాగా నగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కడుతున్నామని, మీరున్న చోటనే ఇండ్లు కావాలంటే కట్టించేందుకు సిద్ధంగా ఉన్నామని,
లేకుంటే ఖాళీ జాగా ఉన్న చోట కట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ వివరించారు.

LEAVE A REPLY