పాలపుంత మధ్యలో ఎప్పు డూ ప్రశాంతంగా

0
31

పాలపుంత మధ్యలో ఎప్పు డూ ప్రశాంతంగా ఉండే ఓ భారీ బ్లాక్‌హోల్ ఉగ్రరూపం దాల్చింది. గురు గ్రహం పరిమాణంలో వాయు గోళాల రూపంలో ఉండే కాస్మిక్ బంతులను భూమి వైపు వెదజల్లింది. ఈ విషయాన్ని తాజాగా అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ నెల 6 తేదీన జరిగిన అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ శీతాకాలం సమావేశాల్లో ఈ అంశానికి సంబంధించిన అధ్యయన అంశాలను పరిశోధకులు వెల్లడించారు. భూమివైపు దూసుకొచ్చే ఈ గోళాలను ఎలా అడ్డుకోవచ్చో అనే అంశాన్ని వివరించారు. గురుత్వాకర్షణ తరంగాల ప్రభావం వల్ల ప్రతీ పదివేల ఏండ్లకు ఒకసారి ఏదో ఓ నక్షత్రం ఇలాంటి చర్యలకు పాల్పడిన సందర్భాలున్నాయని పేర్కొన్నారు. ఓ నక్షత్రం వందలాది గ్రహ శకలాలుగా మారే అవకాశం ఉంటుంది. వాటి ప్రయాణం ఎక్కడ ముగుస్తుంది. భూమి ఎంత మేరకు వచ్చే అవకాశముంది అనే ప్రశ్నల గురించి అధ్యయనం చేశాం. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కంప్యూటర్ కోడ్‌ను రూపొందించాం అని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. తమ అంచనా ప్రకారం ఈ కాస్మిక్ బంతులు భూమికి కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో నిలిచిపోవచ్చనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here