పాలకుర్తి నియోజక వర్గంలో కాంగ్రెస్ డబ్బా ఖాళీ

0
7

సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలతో పాటు తాను చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాలకుర్తి నియోజక వర్గంలో కాంగ్రెస్ డబ్బా ఖాళీ కావడం ఖాయమని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు తీగల కిషన్‌రావు, ఐలోని లక్ష్మీ, ఐలోని మంజుల, లక్ష్మయ్య, చిన్న వెంకటయ్య, సోమయ్యతో పాటు 10 కుటుంబాలు ఎమ్మెల్యే ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్రబెల్లి వారికి స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వోనించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ పాలకుర్తిలో ప్రతిపక్షాలకు స్థానం లేదన్నారు. కాంగ్రెస్‌లో రౌడీలు గుండాలు మాత్రమే మిగిలారని ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY