పార్లమెంట్ నిరవధిక వాయిదా..

0
15

పెద్దనోట్ల రద్దు అంశంపై నెలకొన్న గందరగోళం, ప్రతిపక్షసభ్యుల ఆందోళనల మధ్య పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర ఆరోపణలు, నిరసనలతో అట్టుడికిన పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. గతనెల 16న సమావేశాలు ప్రారంభమైనా నుంచి నోట్ల రద్దు అంశంపై ప్రతిపక్ష పార్టీలు అడ్డుకోవడంతో ఉభయ సభలు పలు మార్లు వాయిదా పడ్డాయి. దాంతో ఒక్క లోక్‌సభలోనే 92 గంటల విలువైన కాలం వృథా అయింది. రాజ్యసభలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. నెలరోజుల సమావేశాల్లో దివ్యాంగుల హక్కుల బిల్లు-2016ను శుక్రవారం లోక్‌సభ ఆమోదించడం ఊరట కలిగించే అంశం.

LEAVE A REPLY