పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

0
34

తెలంగాణ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీ వరకు తొలి విడతను, ఆ తర్వాత మూడు వారాల విరామం ఇచ్చి రెండవ విడతను నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ కమిటీ సమావేశం సిఫారసు చేసింది. సాధారణంగా ఫిబ్రవరి మూడవ లేదా నాల్గవ వారంలో ప్రారంభమై మార్చి రెండవ వారం వరకు కొనసాగే సంప్రదాయానికి భిన్నంగా ఈసారి జనవరి 31వ తేదీన సమావేశాలను ప్రారంభించాలని నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో మంగళవారం ఉదయం జరిగిన ఈ సమావేశానికి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ నెల 31న బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here