పార్టీని చీలనివ్వను

0
17

ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో వివాదం రోజుకొక మలుపు తిరుగుతున్నది. వివాదాలకు దూరంగా ఉండాలని యూపీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌కు ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ హితవు చెప్పారు. బుధవారం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లడానికి ముందు తనను కలిసిన పార్టీ కార్యకర్తలతో భావోద్వేగపూరితంగా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని అన్నారు. మంగళవారం తండ్రీ కొడుకుల మధ్య రెండో దఫా చర్చల్లో పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి వైదొలగబోనని అఖిలేశ్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో రాజీ యత్నాలు విఫలమైన నేపథ్యంలో ములాయం వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

LEAVE A REPLY